రవితేజ సరసన కేథరిన్ ఛాన్స్ కొట్టేసింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ సరసన కేథరిన్ ఛాన్స్ కొట్టేసింది

  • 'నేల టికెట్'తో బిజీగా రవితేజ 
  • వచ్చేనెలలో శ్రీను వైట్లతో సెట్స్ పైకి 
  • ఆ తరువాత సినిమా సంతోష్ శ్రీనివాస్ తో  
ప్రస్తుతం రవితేజ .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును జరుపుకుంది. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయనున్నాడు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా కాకుండా ఆయన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ కేథరిన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ వరుస సినిమాలు చేసేస్తూ .. తనలో ఎంతమాత్రం ఎనర్జీ తగ్గలేదని మరోమారు నిరూపిస్తున్నాడు.     
raviteja
catherine

More Telugu News