సాయిపల్లవి మాటంటే మాటే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవి మాటంటే మాటే!

  • డబ్బుకు ప్రాధాన్యతనివ్వని సాయిపల్లవి
  • సినిమాలపైనే పూర్తి దృష్టి 
  • క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఆలోచన లేని ధోరణి    
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఎంతో క్రేజ్ వుంది. అలాంటి సాయిపల్లవి కెరియర్ విషయంలో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎలా వుండాలనుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టిందో .. అలాగే ముందుకు కొనసాగుతోంది. తనకి పాత్ర ముఖ్యమనీ .. పారితోషికాలు కాదని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి .. ఈవెంట్స్ కి డబ్బుకోసమని మాత్రం వెళ్లను అంది.

 అదే మాటకి ఆమె కట్టుబడి ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఓ పెద్ద సంస్థకి చెందిన వారు .. అమెరికాలో జరగనున్న తమ ఈవెంట్ కి కొన్ని గంటల పాటు హాజరు కావాలనీ, అందుకు 13 లక్షల వరకూ ఇస్తామని ఆఫర్ చేశారట. బిజినెస్ క్లాస్ టికెట్స్ తో పాటు .. స్టార్ హోటల్లో బసను ఏర్పాటు చేస్తామని అన్నారట. అయినా సాయిపల్లవి ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తనకు గల క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఆలోచన సాయిపల్లవికి లేదనే విషయాన్ని గతంలోనూ కొన్ని సంఘటనలు నిరూపించాయి.         
sai pallavi

More Telugu News