క్రికెట్ బెట్టింగ్ రాకెట్ లో ఎంపీ జేసీ ప్రధాన అనుచరుడు... సురేశ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు!
- గతంలో జేసీకి పీఏగా పనిచేసిన సురేష్ రెడ్డి
- ఆపై పంచాయితీ రాజ్ శాఖలో అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్
- అప్పటి నుంచి జేసీకి అనుచరుడిగా సురేష్
కాగా, జేసీకి పీఏగా పనిచేసిన తరువాత, పంచాయితీ రాజ్ శాఖలో ఇంజనీర్ గా పని చేస్తూ సురేష్ ఇటీవల సస్పెన్షన్ కు గురయ్యారు. జేసీ పేరిట ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించాడని, భూకబ్జాలకు పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడం వెనుక ఆయన హస్తముందన్న ఆరోపణలూ ఉన్నాయి.