Mahesh Babu: మార్చి 6న మహేశ్‌ బాబు 'భరత్‌ అనే నేను' లోంచి 'ది విజన్ అఫ్ భరత్'

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు, కైరా అద్వాని, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమా టీజర్ కోసం ప్రిన్స్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 'భరత్ అనే నేను' సినీ బృందం నుంచి వారికి ఓ శుభవార్త అందింది. 'ది విజన్ అఫ్ భరత్' పేరుతో మార్చి 6న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు. 'స్పైడర్' సినిమాతో నిరాశ పరచిన మహేశ్ బాబు.. 'భరత్ అనే నేను' చిత్రంతో హిట్ కొడతాడని అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. 'ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ మహేశ్ ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ వోథ్‌ ఆడియోతో వచ్చి అభిమానుల్లో అమాంతం అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. 
Go Back to Shorts
Mahesh Babu
Bharath Ane Nenu
teaser

More Telugu News