మూడో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి.. క్యాచ్ పట్టిన పోలీసు!
- ఓ అపార్ట్ మెంటులోని మూడో అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతోన్న పిల్లాడు
- గమనించిన పోలీసులు
- దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు
- ఈజిప్టులోని అస్యుట్ నగరంలో ఘటన
ఓ పోలీసు మూడో అంతస్తు ఎక్కి ఆ పిల్లాడిని రక్షించడానికి పరుగెత్తాడు. ఆ బిల్డింగు కింద ఉన్న మిగతా పోలీసులు అ పిల్లాడు పడిపోతే క్యాచ్ పట్టుకోవాలని చూస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా ఆ చిన్నారి జారిపడిపోయాడు. చివరకు ఓ పోలీసు ఆ పిల్లాడికి ఎటువంటి గాయాలు తగలకుండా క్యాచ్ పట్టాడు.