సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నిత్యా మీనన్ 'డౌటు' కథ!
  • హీరోయిన్ చెల్లెలు కూడా వస్తోందట!
  • రంగమ్మగా అనసూయ అభినయం 
  • అమెరికా వెళుతున్న 'గూఢచారి'
*  కథ విషయంలో తనకు చిన్న అనుమానం వచ్చినా సరే 'నో' చెప్పేస్తానని అంటోంది కథానాయిక నిత్యా మీనన్. "నా కెరీర్లో ఇంతవరకు సుమారు 200 కథలు వినివుంటాను. అందులో చేసింది ఏడెనిమిది మాత్రమే వుంటాయి. కథలో ఏ మాత్రం డౌట్ వచ్చినా చేయను" అని చెప్పింది.    
*  గతంలో మహేశ్ బాబు సరసన నటించిన బాలీవుడ్ భామ కృతి సనాన్ ఇప్పుడు తన చెల్లెలు నుపుర్ సనాన్ ను కూడా వెండితెరకు పరిచయం చేస్తోంది. ఇప్పటికే మోడలింగ్ రంగంలో రాణిస్తున్న నుపూర్ త్వరలో సాజిద్ నడియాడ్ వాలా నిర్మించే హిందీ చిత్రంలో నాయికగా నటించనుంది.
*  హాట్ టీవీ యాంకర్ అనసూయ తాజాగా 'రంగస్థలం' చిత్రంలో నటించిన సంగతి విదితమే. ఇందులో ఆమె రంగమ్మగా కనిపించనుంది. ఆమెపై చిత్రీకరించిన 'రంగమ్మ మంగమ్మ' ఫోక్ సాంగును త్వరలో విడుదల చేస్తారు.    
*  అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'గూఢచారి' స్పై థ్రిల్లర్ తదుపరి షెడ్యూల్ షూటింగును అమెరికాలో నిర్వహించనున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ అమెరికా బయలుదేరి వెళుతోంది.ఇందులో శోభిత ధూళిపాళ నాయికగా నటిస్తోంది.   
Nitya
Mahesh Babu
Kruti
anasuya

More Telugu News