'తొలిప్రేమ' చూసి చిరూ ఆశ్చర్యపోయారన్న వరుణ్ తేజ్
- వెంకీ అట్లూరికి చిరూ కాంప్లిమెంట్
- దర్శకుడికి మంచి భవిష్యత్తు వుంది
- ప్రేక్షకులకు వరుణ్ తేజ్ ధన్యవాదాలు
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమాకి నిర్మాత కాకపోయినా కంటెంట్ పై గల నమ్మకంతో ముందుకు నడిపించిన దిల్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమా చూసిన చిరంజీవిగారు .. "ఒక కొత్త దర్శకుడు మొదటి సినిమాను ఇంత బాగా తీశాడా?" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చెప్పాడు. చిరంజీవిగారి నుంచి ఇంతటి కాంప్లిమెంట్ రావడం చూస్తుంటే, వెంకీ అట్లూరికి మంచి భవిష్యత్తు ఉందని అర్థమవుతోందని అన్నాడు. ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు.