తొలిరోజు వసూళ్లతో 'ఫిదా' ను క్రాస్ చేసిన 'తొలిప్రేమ'
- వరుణ్ తేజ్ కెరియర్లో 'ఫిదా' వసూళ్లే రికార్డు
- ఆ సినిమాను రెండవ స్థానంలోకి పంపిన 'తొలిప్రేమ'
- మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం
వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేసిన 'ఫిదా' వసూళ్లను క్రాస్ చేసి, ఆయన కెరియర్లోనే తొలిరోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇంతకు ముందు వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' తొలిరోజున 8.45 కోట్లను వసూలు చేయగా, తొలిప్రేమ' 9.5 కోట్లను వసూలు చేసింది. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమా కంటెంట్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 'ప్రేమికుల రోజు' సందర్భం ఈ సినిమా వసూళ్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.