హనీమూన్ కు టర్కీని ఎంచుకున్న కలెక్టర్ ఆమ్రపాలి!

  • మరో వారంలో ఆమ్రపాలి, సమీర్ ల వివాహం
  • 26న టర్కీకి వెళ్లనున్న కొత్త జంట
  • మార్చి 7 వరకూ అక్కడే
మరో వారం రోజుల్లో ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్ ను జమ్మూ కాశ్మీర్ లో వివాహం చేసుకోనున్న వరంగల్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి రెడ్డి, హనీమూన్ ను టర్కీలో జరుపుకోనున్నారు. ఈనెల 18న ఈ జంట వివాహం జరగనుండగా, 23న వరంగల్ లో, 25న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఆపై 26వ తేదీన టర్కీ వెళ్లనున్న ఆమ్రపాలి, సమీర్ జంట, మార్చి 7 వరకూ అక్కడే గడపనుంది. హైదరాబాద్ లో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు మొత్తం 500 మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Amrapali
Sameer
Marriage
Turkey

More Telugu News