kantarao: సినిమాల కోసమే మా నాన్న ఇల్లు .. భూములు అమ్మేశారు: కాంతారావు తనయుడు రాజా

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా కాంతారావు ఒక వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత ఇప్పటికీ అందరూ ఆయన పేరే చెప్పుకుంటారు. జానపద సినిమాల్లో జరిగే కత్తి యుద్ధాల్లో ఆయన ఎంతో ఒడుపు చూపించేవారు. అందువలన అభిమానులు ఆయనను 'కత్తి' కాంతారావు అని పిలుచుకునేవారు. అలాంటి కాంతారావు తనయుడు రాజా తాజాగా పాప్యులర్ టీవీతో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

 " అప్పట్లో మద్రాసులో మాకు ప్యాలెస్ లాంటి పెద్ద ఇల్లు ఉండేది. అంత ఇంటిని కూడా మా నాన్నగారు సినిమాల కోసం అమ్మేయడం జరిగింది. సినిమాల కోసమే ఆయన భూములను కూడా అమ్మేశారు . అన్నీ పోగొట్టుకుని చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకుని ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ వుండే వాళ్లం. మా ఆర్ధిక సమస్యలు తెలిసి కొంతమంది నిర్మాతలు వేషాలు ఇచ్చి సాయపడ్డారు. సన్మానాలు .. సత్కారాల వలన నాన్నగారికి కొంత మొత్తం వచ్చింది. అయితే ఆ డబ్బంతా కూడా ఆయన కేన్సర్ ట్రీట్మెంట్ కే అయిపోయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
kantarao
raja

More Telugu News