'తొలిప్రేమ'లో డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాను: రాశి ఖన్నా
- డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది
- మూడు రకాల లుక్స్ తో కనిపిస్తాను
- వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు
ఈ పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందనీ, సినిమా మొత్తం మీద మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని అంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. స్క్రిప్ట్ ఫై రెండు సంవత్సరాలుగా కసరత్తు చేస్తూ వచ్చిన వెంకీ అట్లూరి, ఈ సినిమాను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడని, ప్రేమ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ ను బట్టి ఎలా మారుతూ వెళుతుందనే కాన్సెప్ట్ ను ఆయన బాగా చెప్పాడని అంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంతగానో కష్టపడ్డాడని, తాము పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.