ప్రజల సొమ్ముతో ఖరీదైన కళ్లద్దాలు... కేరళలో నేతల విలాసాలపై విమర్శలు... వివాదంలో స్పీకర్
Add ap7am to your home Screen

ప్రజల సొమ్ముతో ఖరీదైన కళ్లద్దాలు... కేరళలో నేతల విలాసాలపై విమర్శలు... వివాదంలో స్పీకర్

  • రూ.49,000 విలువైన కళ్లద్దాలను ధరించిన స్పీకర్
  • వైద్య మంత్రి కళ్లజోడు ఖరీదు రూ.28,000
  • ప్రజల సొమ్మును తెగ ఖర్చు చేసేస్తున్న నేతలు
కేరళలో సీపీఎం నాయకులు తమ చర్యలతో విమర్శల పాలవుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ రూ.28,000 ఖరీదైన కళ్లద్దాల అంశం మరిచిపోకముందే, ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కూడా ఇప్పుడు ఇదే విధమైన వివాదంలో చిక్కుకున్నారు. స్పీకర్ శ్రీరామకృష్ణన్ ధరించే కళ్లద్దాల ధర రూ.49,000. వైద్య మంత్రి శైలజ, స్పీకర్ శ్రీరామకృష్ణన్ సొంత డబ్బుతో ఎంతటి ఖరీదైన అద్దాలను కొని ధరించితే ఏ వివాదం లేదు.

కానీ, వీరి కళ్లద్దాలకు అయిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే వివాదానికి దారితీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు వెలుగు చూశాయి. కేరళ చట్టసభ సభ్యులు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై అక్కడి మీడియాలోనూ కథనాలు వచ్చాయి. దీనిపై స్పీకర్ శ్రీరామకృష్ణన్ స్పందిస్తూ... తాను అసెంబ్లీలో తరచుగా అటూ, ఇటూ చూడాల్సి ఉంటుందని, స్పష్టంగా కనిపించకపోవడంతో వైద్యుల సూచన మేరకు మంచి కళ్లద్దాలను తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
eye glasses
kerala
spectacles

More Telugu News