'బాగుంది'.. కేంద్ర బడ్జెట్‌పై నారా బ్రాహ్మణి స్పందన
- బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయి
- ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామం
- కిసాన్ కార్డులు ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు కూడా ఇవ్వనున్నారు
ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామమని తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని చెప్పారు.