gopichand: మెహ్రీన్ తో కలిసి రెడీ అవుతోన్న గోపీచంద్

షార్ట్స్‌లో చూడండి
విలన్ గా ఎంట్రీ ఇచ్చి .. యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ తోను శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన 25వ సినిమాను చక్రి దర్శకత్వంలో చేస్తున్నాడు. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.

రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ను మొదలెట్టనుంది. ఈ సినిమాకి 'పంతం' .. 'శపథం' అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. మే 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక గోపీచంద్ తన 26వ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో .. వీరు పోట్ల దర్శకత్వంలోను, 27వ సినిమాను తమిళ దర్శకుడు 'తిరు'తోను చేయనున్నట్టు సమాచారం.   
Go Back to Shorts
gopichand
mehreen

More Telugu News