charan: ఫస్టు షెడ్యూల్ పూర్తిచేసుకున్న చరణ్ - బోయపాటి మూవీ

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగానే, చరణ్ తో బోయపాటి సినిమా మొదలైపోయింది. చరణ్ .. 'రంగస్థలం' సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన, ఇతర పాత్రలకి సంబంధించిన సన్నివేశాలతో కొన్ని రోజుల క్రితమే ఫస్టు షెడ్యూల్ ను ఆరంభించారు.

నిన్నటితో ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, వివేక్ ఒబెరాయ్ .. స్నేహా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో చరణ్ పాల్గొంటాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.      
Go Back to Shorts
charan
kiara adwani

More Telugu News