అపూర్వ కలయిక.. ప్రపంచంలోనే అతి పొట్టి మహిళను కలిసిన పొడగిరి!
Add ap7am to your home Screen

అపూర్వ కలయిక.. ప్రపంచంలోనే అతి పొట్టి మహిళను కలిసిన పొడగిరి!

  • పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇద్దరినీ కలిపిన ఈజిప్ట్
  • గిజా పిరమిడ్ల వద్ద సందడి..
  • ఫొటోల కోసం పర్యాటకులు క్యూ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళను కలిశాడు. ఈజిప్టులోని ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ల వద్ద ఈ అద్భుత కలయిక చోటుచేసుకుంది. 8 అడుగుల 2.8 అంగుళాల పొడవుతో టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ ప్రపంచలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్సిస్ రికార్డులకెక్కాడు. భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే 2 అడుగుల 6 అంగుళాల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. వీరిద్దరూ 2011లోనే రికార్డుల కెక్కడం గమనార్హం.

ఈజిప్టు పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈజిప్షియన్ ప్రభుత్వం ఈ ఇద్దరితో ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వీరిద్దరూ కైరోలోని చారిత్రక గిజా పిరమిడ్ల వద్ద సందడి చేశారు. పర్యాటకులతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు నానా అవస్థలు పడ్డారు. ఈజిప్టులోని మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ సుల్తాన్ కోసెన్, జ్యోతి అమ్గేలు సందర్శించనున్నారు.
smallest woman
tallest man
Egypt
Jyoti Amge
Sultan Kosen

More Telugu News