bumra: ఐదు వికెట్లు తీసిన బుమ్రా... దక్షిణాఫ్రికా ఆలౌట్!

షార్ట్స్‌లో చూడండి
జోహన్స్‌బర్గ్‌లో జ‌రుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. బుమ్రా చెలరేగి బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. దీంతో దక్షిణాఫ్రికాను భారత్ 194 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లు విసురుతోన్న బంతుల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఆమ్లా 61, ఫిలండెర్ 35, రబడా 30 మినహా ఇతర ఏ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. ఎల్గర్ 4, మార్క్ రం 2, డివిల్లియర్స్ 5, డుప్లెసిస్ 8, డి కాక్ 8, ఆండిలె 9, మార్కెల్ 9 (నాటౌట్), ఎన్గిడి 0 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో బుమ్రాకి ఐదు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్‌కి 3, ఇషాంత్ శర్మ, షమీలకు తలో ఒక వికెట్లు దక్కాయి. కాగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా కన్నా భారత్ 7 పరుగులు వెనకబడి ఉంది.
Go Back to Shorts
bumra
Cricket
india
south africa

More Telugu News