airtel: జియోకు దీటుగా ఎయిర్ టెల్ డేటా ప్లాన్లు... రోజుకు 1.4 జీబీ డేటా

షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ జియో అన్ని ప్లాన్లపై రోజుకు అర జీబీ అదనంగా ఇస్తూ రిపబ్లిక్ డే ఆఫర్ ప్రకటించగా, పోటీ సంస్థ ఎయిర్ టైల్ సైతం ఈ దిశగా అడుగులేసింది. రూ.199 (28 రోజులు), రూ.448(82 రోజులు), రూ.509(90 రోజులు) ప్యాక్ లపై ఇక నుంచి ప్రతీ రోజూ 1.4 జీబీ అధిక వేగంతో కూడిన డేటాను పొందొచ్చు. ఇక అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంలో ఎటువంటి మార్పు లేదు. ఇక రూ.349 ప్లాన్ లో ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా, 70 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.399 ప్లాన్ లో రోజుకు 1జీబీ డేటా అందుతుంది.
Go Back to Shorts
airtel

More Telugu News