Jana Sena: ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో జ‌న‌సేన నేత‌ల భేటీ

షార్ట్స్‌లో చూడండి
పార్టీని బ‌ల‌ప‌ర్చుకోవాల‌ని ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటోన్న సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ జ‌న‌సేన పార్టీ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గడ ప‌ద్మ‌నాభంను జ‌న‌సేన బృందం క‌లిసింది. జ‌న‌సేన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘ‌వ‌య్య ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌తో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో జ‌న‌సేన బృందం ఏయే అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతోందో తెలియాల్సి ఉంది. కాగా, జ‌న‌సేన పార్టీ ఇప్ప‌టికే పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Jana Sena
mudragada
Pawan Kalyan

More Telugu News