'రంగస్థలం'లో మీరు రామ్ చ‌ర‌ణ్‌కి అత్త‌గా చేస్తున్నారా? అని అడిగిన అభిమాని.. సమాధానం ఇచ్చిన అనసూయ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం'లో మీరు రామ్ చ‌ర‌ణ్‌కి అత్త‌గా చేస్తున్నారా? అని అడిగిన అభిమాని.. సమాధానం ఇచ్చిన అనసూయ!

  • నా జీవితంలో మంచి విషయాలన్నీ జరగాల్సిన స‌మ‌యానికే జరిగాయి
  • నా బలం 'నా ఆత్మ' 
  • ట్విట్టర్‌లో అభిమానులతో హాట్ యాంకర్ ఛాటింగ్‌ 
హాట్ యాంక‌ర్ అన‌సూయ ఈ రోజు ట్విట్ట‌ర్లో త‌న అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. 'మీ పేరుకి అర్థం ఏంటీ?' అని ఒక అభిమాని అడ‌గ‌గా 'అసూయ లేనిది అన‌సూయ' అని ఆమె చెప్పింది. 'మీరు ఇంత త్వరగా పెళ్లి ఎందుకు చేసుకున్నారు?' అని మ‌రో నెటిజ‌న్ అడ‌గ‌గా 'అందరికీ ఒకటే చెబుతున్నా. నా జీవితంలో మంచి విషయాలన్నీ జరగాల్సిన స‌మ‌యానికే జరిగాయి' అని చెప్పింది.

'నాకు ప‌రీక్ష‌లు ఉన్నాయి.. ఆల్ ది బెస్ట్ చెప్పు మేడం' అని ఒక అభిమాని కోర‌గా.. అన‌సూయ ఆ అభిమానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. 'నీ బ‌లం ఏంటీ?' అని ఒక నెటిజ‌న్ అడ‌గ‌గా 'నా ఆత్మ' అంటూ ఆమె స‌ర‌దాగా రిప్లై ఇచ్చింది. 'రంగస్థలం'లో మీరు రామ్ చ‌ర‌ణ్ కి అత్త‌గా చేస్తున్నారా? అని ఒక అభిమాని అడ‌గ‌గా 'అస‌త్యం' అని అన‌సూయ స‌మాధానం ఇచ్చింది.
anasuya
Ramcharan
cinema

More Telugu News