ఆరు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • రెండో టెస్టులో తొలి రోజు ముగిసిన ఆట
  • దక్షిణాఫ్రికా 269/6
  • రవిచంద్రన్ అశ్విన్‌కి మూడు వికెట్లు
సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో బ్యాటింగ్‌ చేస్తోన్న సౌతాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డీన్ ఎల్గర్ 31, మార్క్‌రమ్ 94, డివిల్లియర్స్ 20, హషీమ్ ఆమ్లా 82 (రనౌట్), డీ కాక్ 0, ఫిలిండెర్ 0 (రనౌట్) పరుగులకి అవుట్ అయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో డెప్లెసిస్ 24, కేశవ్ మహరాజ్ 10 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 269/6 (90 ఓవర్లకి) గా ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. 
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News