అమెరికాపై చైనా చిర్రుబుర్రు.. పాక్‌ను వేలెత్తి చూపొద్దని హుకుం!
- పాక్‌ను వెనకేసుకొచ్చిన చైనా
- అమెరికా తీరుపై మండిపాటు
- వేలెత్తి చూపడం మాని సహకరించుకోవాలని పిలుపు
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడం, తప్పులు వెతకడం మాని పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలోనూ పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉగ్రవాదం పీచమణచేందుకు పరస్పర సహాయసహకారాలు అవసరమని లుకాంగ్ పేర్కొన్నారు.