209 పరుగులకే టీమిండియా ఆలౌట్!
- మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా స్కోరు 286 (ఆలౌట్)
- 93 పరుగులు చేసి ఇండియాను ఆదుకున్న హార్దిక్ పాండ్యా
- చెప్పుకోదగ్గ స్కోరు చేయలేని ఇతర బ్యాట్స్ మెన్
మొదటి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్‌మెన్‌లో హార్దిక్ పాండ్యా మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మురళీ విజయ్ 1, శిఖర్ ధావన్ 16, చటేశ్వర పుజారా 26, విరాట్ కోహ్లీ 5, రోహిత్ శర్మ 11, రవిచంద్రన్ అశ్విన్ 12, హార్దిక్ పాండ్యా 93, వృద్ధిమాన్ సాహా 0, భువనేశ్వర్ కుమార్ 25, షమీ 4, బుమ్రా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఫిలండెర్ మూడేసి వికెట్లు తీయగా, స్టెయిన్, మార్కెల్ తలో రెండు వికెట్లు తీశారు.