విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ... స్వల్పంగా చెలరేగిన మంటలు
- ప్రయాణికులు సురక్షితం
- కెనడాలో ప్రమాదం
- టొరంటో విమానాశ్రయంలో ఇది రెండో ఘటన
ఈ రెండు విమానాలను వెస్ట్‌జెట్, సన్‌వింగ్ విమానయాన సంస్థలకు చెందినవిగా గుర్తించారు. ఇరు సంస్థలు ప్రమాదానికి సంబంధించి అధికారిక ప్రకటన జారీ చేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నాయి. కాగా టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఐదు నెలల క్రితం కెనడా, పోలండ్‌లకు చెందిన రెండు విమానాలు రన్‌వే మీద ఒకదానిని మరొకటి ఢీ కొట్టుకున్నాయి.