చంద్రబాబుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
Add ap7am to your home Screen

చంద్రబాబుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి

  • జన్మభూమి కార్యక్రమంలో వివాదం
  • వైయస్ ను పొగిడిన అవినాశ్
  • అడ్డుకున్న టీడీపీ నేతలు
జన్మభూమి కార్యక్రమం సందర్భంగా వేదికపై మాట్లాడుతున్న తన చేతిలోని మైక్ ను సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే లాక్కునే ప్రయత్నం చేశారంటూ లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వేదికపై ఒక రౌడీ షీటర్ కూడా ఉన్నారని... అతను కూడా తన మైక్ లాక్కునే ప్రయత్నం చేశాడని చెప్పారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలో వందలాది మంది టీడీపీ నేతలు వేదికపై ఎలా ఉంటారని ప్రశ్నించారు. వేదికపై పార్లమెంటు సభ్యుడినే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. లేఖతో పాటు దినపత్రికలలో ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్ లను కూడా ఆయన జత చేశారు. 
Chandrababu
avinash reddy

More Telugu News