రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి: మంత్రి కేటీఆర్
- మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఓ నెటిజన్
- అందుకు ప్రతిస్పందించిన మంత్రి కేటీఆర్
- రాహుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ ట్వీట్ చేసిన వైనం
‘గౌరవప్రదమైన తెలంగాణ కేబినెట్ మంత్రిపై చేసిన చౌకబారు వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలను కేవలం గుజరాత్ ఎన్నికలకు మాత్రమే వారు పరిమితం చేశారేమో చూద్దాం’ అన్నారు కేటీఆర్.