bangalore: బెంగళూరు సిటీకి ప్రత్యేక అధికారిక లోగో... దేశంలో మొదటి సిటీ!
భారతదేశంలో మొదటిసారిగా అధికారిక లోగో రూపొందించుకున్న నగరంగా బెంగళూరు నిలిచింది. ఎరుపు, నలుపు రంగుల్లో కన్నడ, ఇంగ్లిషు లిపిలో రాసిన లోగోను కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆవిష్కరించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ లోగోను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ లోగోతో న్యూయార్క్, మెల్‌బోర్న్, సింగపూర్ వంటి సిటీల సరసన బెంగళూరు చేరింది. ఒక కాంటెస్ట్ నిర్వహించి ఈ లోగోను నిపుణుల బృందం ఎంపిక చేసింది. ఈ లోగోను నమ్మూరుకి చెందిన డిజైనర్ వినోద్ కుమార్ వేశారు. ఇంగ్లిష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా ఈ లోగో డిజైన్ చేశారు. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల్లో బెంగళూరు బ్రాండ్‌ను ఈ లోగో సుస్థిర పరచనుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.