తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు!
- రేవంత్ రెడ్డిలా తాను దొంగ వ్యాపారాలు చేయలేదని ఇటీవల లక్ష్మారెడ్డి ఆరోపణలు
- లక్ష్మారెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోను
- అసలు లక్ష్మారెడ్డి డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినల్‌దేనా?
- నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు లక్ష్మారెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్
లక్ష్మారెడ్డి డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినల్‌దేనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి 1987లో బీహెచ్‌ఎంఎస్ కోర్సు పాసైనట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, అయితే, ఆ కోర్సుకు 1985లో అనుమతి ఇచ్చారని, ఆ కోర్సు మొదటి బ్యాచ్ 1990కి బయటికి వచ్చిందని వివరించారు. మరి 1987లోనే పాసైనట్లు లక్ష్మారెడ్డి ఎలా పేర్కొన్నారని నిలదీశారు.
తమ గురించి మాట్లాడేటప్పుడు తమ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని రేవంత్ రెడ్డి లక్ష్మారెడ్డిని హెచ్చరించారు. జడ్చర్లలో టీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో లక్ష్మారెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ఉన్నారని అన్నారు.