ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన పక్కనే ఉంటా: కమెడియన్ రఘు
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన పక్కనే ఉంటా: కమెడియన్ రఘు

  • పెద్ద ఎన్టీఆర్ అంటే ఇష్టం 
  • చిన్న ఎన్టీఆర్ సినిమాతో నా కెరియర్ మొదలు
  • అప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం 
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రఘు, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "ఎన్టీఆర్ పై మీకు ప్రత్యేకమైన అభిమానం వుందికదా .. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆయనతో వెళతారా .. లేదా?" అనే ప్రశ్న రఘుకి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. " తను వెళ్లడమంటూ జరిగితే తన పక్కన నిలబడటానికి ఏ రోజూ వెనుకాడను. చిన్నప్పటి నుంచి పెద్ద ఎన్టీఆర్ ను చూస్తూ పెరిగినవాడిని. మొదటి నుంచి ఆయనంటే ఎంతో ఇష్టం. అనుకోకుండా నేను సినిమాల్లోకి రావడం ..  ఫస్టు సినిమాయే జూనియర్ ఎన్టీఆర్ 'ఆది' కావడం .. ఆయనతో నా అనుబంధం అక్కడి నుంచి మొదలుకావడం జరిగింది. ఈ 15 యేళ్లుగా ఆ రిలేషన్ షిప్ కొనసాగుతూనే వుంది. అలాంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్ గా ఆయనతోనే వుంటాను .. అందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చారు.      
raghu
ntr

More Telugu News