బరువు తగ్గమన్న త్రివిక్రమ్ .. కసరత్తు చేస్తోన్న ఎన్టీఆర్!
Add ap7am to your home Screen

బరువు తగ్గమన్న త్రివిక్రమ్ .. కసరత్తు చేస్తోన్న ఎన్టీఆర్!

  • ఈ మధ్య బరువు పెరిగిన ఎన్టీఆర్
  • నెక్స్ట్ మూవీలో సన్నగా కనిపించే ప్రయత్నం 
  • కొత్త ప్రాజెక్టు పట్ల అభిమానుల్లో ఆసక్తి  
ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ ను చూసినవాళ్లు ఆయన బాగా ఒళ్లు చేశారనీ, కాస్త తగ్గితే బాగుంటుందని చెప్పుకున్నారు. అయితే కథా పరంగా కూడా ఆయన కాస్త సన్నబడాలని త్రివిక్రమ్ చెప్పాడట. సినిమా షూటింగ్ సమయానికి 10 కేజీలకి పైగా బరువు తగ్గేలా చూసుకోమని అన్నాడట. దాంతో ఎన్టీఆర్ కసరత్తు మొదలెట్టేసినట్టు సమాచారం.

'ఊసరవెల్లి' సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వరుసగా భారీ విజయాలను అందిస్తూ వస్తోన్న త్రివిక్రమ్, ఎన్టీఆర్ కి కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమనే ఆశతో ఆయన అభిమానులు వున్నారు.           
trivikram
ntr

More Telugu News