Shaima Ahmed: అత్యంత జుగుప్సాకరంగా నటించావంటూ ఈజిప్ట్ హాట్ బ్యూటీకి రెండేళ్ల జైలుశిక్ష!

  • మ్యూజిక్ వీడియోను అసభ్యంగా రూపొందించిన షైమా
  • ఇన్నర్ వేర్ తో క్లాస్ రూములో విద్యార్థులకు పాఠాలు
  • క్షమాపణలు చెప్పినా కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ మ్యూజిక్ వీడియోలో అత్యంత జుగుప్సాకరంగా నటించిందన్న ఆరోపణలపై ప్రముఖ ఈజిప్ట్ పాప్ సింగర్, హాట్ బ్యూటీ షైమా అహ్మద్ కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించిన షైమా, అందులో ఇన్నర్ వేర్ మాత్రమే ధరించి క్లాస్ రూములో అసభ్యంగా నిలుచుని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్టు కనిపించింది.

ఓ అరటి పండును తినే సీన్ లో, అసహ్యం కలిగేలా ప్రవర్తించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతో మంది ఆమెపై ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. ఆపై పాయమా క్షమాపణలు చెప్పినప్పటికీ, కేసు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం, ఆమె నటన హేయమని, సమాజానికి చెడు సంకేతాలు పంపిందని అభిప్రాయపడ్డ కోర్టు రెండేళ్ల శిక్షను విధించింది.

కాగా, తనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరిస్తున్న సమయంలో పాయమా ఖురాన్ చదువుతూ కనిపించింది. కాగా, షైమా అనతికాలంలోనే పాప్యులర్ అయిన సెన్సేషనల్ స్టార్. సోషల్ మీడియాలో ఆమె ఖాతాలకు 10 లక్షల మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు.
Shaima Ahmed
Egypt
Banana
Valgar

More Telugu News