అనుష్కతో డేటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కోహ్లీ కెరీర్ గ్రాఫ్ ఎలా పెరిగిందంటే..!
- తార స్థాయికి చేరుకున్న కోహ్లీ గ్రాఫ్
- ఎన్నో రికార్డులు బద్దలు
- 36 సెంచరీలు బాదాడు
వరుసగా అత్యధిక సిరీస్ లను గెలుచుకున్న కెప్టెన్ గా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీపాంటింగ్ పేరు మీద ఉన్న రికార్డును ఇటీవలే కోహ్లీ సమం చేశాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను గెలిచిన తరుణంలో ఈ మైలురాయిని అందుకున్నాడు. గత రెండేళ్లలో బ్యాట్స్ మెన్ గా కోహ్లీ అత్యుత్తమ క్రికెట్ ఆడాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా 610 పరుగులు సాధించాడు. కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును కోహ్లీ ఈ ఏడాది బద్దలు కొట్టాడు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది 11 సెంచరీల సాయంతో 2818 పరుగులను కోహ్లీ సాధించాడు.