అమెరికాలోని మన్‌హట్టన్‌లో ఉగ్రదాడి.. బాంబు పేల్చడంలో విఫలమై గాయాలపాలైన ఉగ్రవాది!
- ఉగ్రవాది ఐసిస్ సానుభూతిపరుడు
- బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్ ఉల్లాగా గుర్తింపు
- ఏడేళ్లుగా అమెరికాలో నివాసం
- పనిచేస్తున్న కంపెనీలోనే బాంబు తయారీ
ఉగ్రవాదిగా అనుమానిస్తున్న అతడిని బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్ ఉల్లాగా గుర్తించారు. ఐసిస్ సానుభూతి పరుడు అయిన అతడు ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు. ఉల్లా తాను పనిచేస్తున్న ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబును తయారు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోమవారం ఉదయం జాకెట్‌లో బాంబు పెట్టుకుని బస్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ఉల్లా బాంబును పేల్చడంలో విఫలమయ్యాడు. దీంతో బాంబు సరిగా పేలలేదు సరికదా, ఉల్లా గాయపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.