'జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌' చిత్ర డిస్ట్రిబ్యూట‌ర్లకు నష్టాలు పూడ్చిన షారుక్ ఖాన్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌' చిత్ర డిస్ట్రిబ్యూట‌ర్లకు నష్టాలు పూడ్చిన షారుక్ ఖాన్‌!

  • న‌ష్టాల‌ను భ‌రించిన న‌టుడు
  • పెద్ద‌గా ఆడ‌ని షారుక్‌, అనుష్క‌ల చిత్రం
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇంతియాజ్ అలీ
ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్ ఖాన్‌, అనుష్క శ‌ర్మ‌లు జంటగా న‌టించిన 'జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌' ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రుచించ‌లేదు. రూ. 100 కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం రూ. 64.33 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. స‌ల్మాన్ ఖాన్ త‌ర‌హాలోనే షారుక్ కూడా డ‌బ్బులు తిరిగిచ్చి త‌మ‌ను ఆదుకోవాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు ఆయ‌న‌కు మెసేజ్‌లు చేశారు.

ఆ మెసేజ్‌ల‌కు ఇటీవ‌ల షారుక్ స్పందించిన‌ట్లు తెలుస్తోంది. వారిని ఆదుకోవ‌డానికి న‌ష్టాల‌ను షారుక్ త‌న భుజాల‌పై వేసుకున్న‌ట్లు స‌మాచారం. డిస్ట్రిబ్యూట్ చేసిన ఎన్‌హెచ్ స్టూడియోజ్‌కి 15 శాతం న‌ష్ట‌ప‌రిహా‌రం, ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు 30 శాతం వ‌రకు న‌ష్ట‌ప‌రిహా‌రం చెల్లించిన‌ట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గ‌తంలో 'దిల్‌వాలే', 'అశోక', 'ప‌హేలీ' చిత్రాల స‌మయంలో కూడా షారుక్ న‌ష్టాల‌ను భ‌రించాడు.
jab harry met sejal
Shahrukh Khan
Anushka Sharma

More Telugu News