Pawan Kalyan: 'బాబులకి బాబు కల్యాణ్ బాబు'.. ఏంటీ నినాదం.. విజయవాడ రావడం నాకు చాలా ఇబ్బంది!: పవన్ కల్యాణ్
అభిమానం ఉండాలి కానీ, ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "విజయవాడ రావడం నాకు చాలా ఇబ్బంది... ఇబ్బంది దేనికో చెబుతాను.. బాబులకి బాబు కల్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తారు. ఇవన్నీ నాకు నచ్చవు. దాంట్లో ఏముంది? చెప్పండి.
మీ అభిమానం ప్రజలని ఇరిటేట్ చేసేలా వుండకూడదు. ఆనందింపజేసేలా ఉండాలి. విజయవాడకి ఇంకా చాలా బలమైన ఆలోచన విధానం రావాలి. ఇంకా విశ్వనగరానికి ఉండాల్సిన లక్షణాలు లేవు.. నేర్చుకోవాలి. నాకు ఆవేశం ఉంటుంది.. అది ఆలోచనతో కూడిన ఆవేశం. ఆలోచనలేని ఆవేశం కాదు.. మీ అందరి కోసం నేను ఇలాంటి వర్క్ షాప్స్ పెడతాను" అని వ్యాఖ్యానించారు.