ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. చెద‌ర‌గొట్టిన‌ పోలీసులు!

సినీన‌టుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ‌ప‌ట్నం, రాజమహేంద్ర‌వ‌రం పర్యటనలు ముగించుకుని విజయవాడలో బ‌స చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ హోటల్‌ మురళీ ఫార్చున్‌లో దిగారు. ఈ క్రమంలో, హోటల్ దగ్గరికి ఆయ‌న‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, 'ప‌వ‌నిజం, ప‌వ‌న్ సీఎం' అంటూ నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు ఈ సారి పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.   
Go Back to Shorts
Pawan Kalyan
fans
police

More Telugu News