Pawan Kalyan: కోడి గుడ్డు మీద ఈకలు పీకాలంటే పీకండి... నేనేం పీకగలనో చూపిస్తాను!: పవన్ కల్యాణ్
తనపై పలువురు ఆరోపణలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలికిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు చాలా నిజాయతీగా ఉన్నానని అన్నారు. ఇంకా నిజాయతీగా ఉండాలంటే తన వల్ల కాదని ఆయన చెప్పారు.
అయినా కొంత మంది కోడిగుడ్డుపై ఈకలు పీకాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా పీకాలనుకుంటే పీకవచ్చని, తాను ఏం పీకగలనో చూపిస్తానని ఆయన ఆవేశంగా అన్నారు. అలాగే గతంలో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నేనెవరో వాళ్లకి తెలియకపోవచ్చు...కానీ బీజేపీ ఎంపీ గంగరాజు, హరిబాబు, అవంతి శ్రీనివాస్, ఆశోక్ గజపతి రాజు తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.