Pawan Kalyan: నేను అభిమానించే ఇద్దరు పోరాట యోధులు వీరే!: ట్విట్టర్ లో అరుదైన ఫొటో పెట్టిన పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
తనకు ఇష్టమైన ఇద్దరు పోరాట యోధులు వీరేనని, వీరిద్దరూ కలసి ఉన్న అపూర్వ చిత్రం లండన్ లో తనకు దొరికిందని చెబుతూ, పవన్ కల్యాణ్ ఓ అపురూప చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ లు కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్న ఈ చిత్రం తనకు లండన్ లోని అంబేద్కర్ హస్ లో కనిపించగా, దాని కాపీని తీసుకున్నానని చెప్పారు.

వీరిద్దరూ సమాజంలో అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో తమ తుది శ్వాస వరకూ పోరాడారని కొనియాడారు. వీరిద్దరూ తన ఫేవరెట్ పోరాట యోధులని చెప్పాడు. పవన్ ట్వీట్ చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Pawan Kalyan
ambedkar
Periyar

More Telugu News