వైరల్... సోషల్ మీడియాలో 'అజ్ఞాతవాసి' షూటింగ్ వీడియో!

  • సామాజిక మాధ్యమాల్లో లీక్ అయిన షూటింగ్ దృశ్యాలు, ఫోటోలు
  • ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీసు వద్ద జరుగుతున్న షూటింగ్
  • 2018 జనవరి 10న థియేటర్లను తాకనున్న 'అజ్ఞాతవాసి'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన 25వ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి'గా వస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలకు ఆందోళన కలిగిస్తూ, సినిమా షూటింగ్ కు సంబంధించిన చిన్న వీడియో బిట్, ఫోటోలు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఇవి ఆన్ లైన్లో ఇప్పుడు వైరల్. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీసు వద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ వీడియో తీసినట్టు సమాచారం. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, కీర్తీ సురేష్, అనూ ఇమ్మానుయేల్, ఆది, కుష్బూ, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్ లో జనవరి 10న చిత్రం థియేటర్లను తాకనుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Agnatavasi
Trivikram Srinivas
Social Media
Leak
Shooting

More Telugu News