టైటిల్ ను .. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న మెగా హీరో!
- వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ'
- టైటిల్ పోస్టర్ రిలీజ్
- కథానాయికగా రాశి ఖన్నా
- ఫిబ్రవరి 9వ తేదీన విడుదల
టైటిల్ లోగో చాలా సింపుల్ గాను .. ఆకర్షణీయంగాను వుంది. ఇక పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంటూ .. యూత్ కు కనెక్ట్ అయ్యేలా వుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో పవన్ చేసిన 'తొలిప్రేమ' ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇక అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కి ఈ టైటిల్ ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.