tapsee pannu: అనురాగ్ క‌శ్య‌ప్ దర్శ‌క‌త్వంలో తాప్సీ, దుల్క‌ర్ స‌ల్మాన్‌

షార్ట్స్‌లో చూడండి
ఎప్ప‌ట్నుంచో హిందీ సినిమా అభిమానుల‌ను ఊరిస్తున్న 'మ‌న్‌మ‌ర్జియాన్' సినిమా ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్క‌నుంది. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, తాప్సీ, విక్కీ కౌష‌ల్ ప్ర‌ధాన పాత్రంలో న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి నిర్మాత‌గా ఆనంద్ ఎల్‌. రాయ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే మొద‌ట చిత్రంలో న‌టించ‌డానికి ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫ‌డ్నేక‌ర్‌ల‌ను అనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. అలాగే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు కూడా స‌మీర్ శ‌ర్మ నుంచి అశ్వ‌నీ అయ్య‌ర్ తివారీకి, ఆయ‌న ద‌గ్గ‌ర్నుంచి చివ‌ర‌గా అనురాగ్ క‌శ్య‌ప్‌కి చేరుకున్నాయి. బాలీవుడ్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్ప‌టికే ఆయ‌న 'కార్వాన్' అనే చిత్రంలోన‌టిస్తున్నారు. వ‌చ్చే నెల హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 'మ‌న్‌మ‌ర్జియాన్' చిత్ర షూటింగ్ ప్రారంభ‌కానుంది.
Go Back to Shorts
tapsee pannu
manmarziya
dulqar salman
anurag kashyap

More Telugu News