రాజమౌళి సినిమాలో రాంచరణ్ హీరో అయితే, ఎన్టీఆర్ ది విలన్ పాత్రట!
- రాజమౌళి తరువాతి చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్
- ఎన్టీఆర్ పాత్రకు నెగటివ్ షేడ్స్
- టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్!
ఈ చిత్రంలో రాంచరణ్ హీరో కాగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ధరిస్తున్నారని, ఇద్దరి క్యారెక్టర్లూ సమానంగా ఉండేలా, ఏమాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా రాజమౌళి తీర్చిదిద్దారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ బాక్సర్లుగా నటిస్తున్నారని ఇటీవలే ఓ వార్త వచ్చిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'జై లవకుశ'లో ఎన్టీఆర్ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా పోషించి రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. తన సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లను హీరోలతో సమానంగా తీర్చిదిద్దే రాజమౌళి, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారో మరి. దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఏదీ ఇంకా బయటకు రాలేదు.