sai dharam tej: ఎన్టీఆర్ .. చరణ్ మల్టీస్టారర్ లో నేను చేయడం లేదు: సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 'జవాన్' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన చేతిలో వినాయక్ .. కరుణాకరన్ సినిమాలు వున్నాయి. కొంతమంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగా వున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించనున్నాడంటూ ఒక ప్రచారం ఊపందుకుంది.

 ఎన్టీఆర్ .. చరణ్ లతో ఇటీవల రాజమౌళి దిగిన ఓ ఫోటో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. "వీళ్ల కాంబినేషన్లో ఒక సినిమా రానుందనే విషయం తెలిసి మొదటి నేను కూడా పుకారేనని అనుకున్నాను .. నిజమని తెలిసి చాలా థ్రిల్ ఫీలయ్యాను" అంటూ ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ చెప్పాడు. అప్పటి నుంచి ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ విషయపై తేజు స్పందిస్తూ .. ఎన్టీఆర్ - చరణ్ లతో రాజమౌళి చేస్తోన్న సినిమాలో తాను లేనని చెప్పాడు. కథ కుదిరితే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే వున్నానంటూ స్పష్టం చేశాడు. 
Go Back to Shorts
sai dharam tej
charan
ntr

More Telugu News