ఇదో వెరైటీ.. ఆ రెస్టారెంట్ కు వెళితే చేతులకు బేడీలే!
- ఈజిప్టులో వినూత్న రెస్టారెంట్
- జైల్ థీమ్ తో హోటల్ నిర్వహిస్తున్న వలీద్ నయీమ్
- వెరైటీగా ఉందని క్యూ కడుతున్న భోజన ప్రియులు
ఈజిప్టులోని మన్ సూర్ ఏరియాలో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు 'ఫుడ్ క్రైమ్'. అందరిలా ఆలోచిస్తే వ్యాపారంలో ఎదగలేమని భావించిన దీని యజమాని వలీద్ నయీమ్, వినూత్నంగా ఉండాలని ఇలా చేశాడట. ఇక ఈ రెస్టారెంట్ కు వచ్చిన వారు జైలు గదుల్లా కనిపించే గదుల్లో కూర్చుని ఖైదీల్లా భోజనం చేయడం థ్రిల్లింగ్ గా ఉందని అంటున్నారు. ఈ రెస్టారెంట్ కు స్థానిక పోలీసులు కూడా వచ్చి ఖైదీలుగా మారిపోయి తిని వెళుతున్నారట.