ఇవాంక రాక... న‌వ‌దీప్ పాట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంక రాక... న‌వ‌దీప్ పాట!

  • ట్రాఫిక్‌లో చిక్కుకున్న సినీన‌టుడు న‌వ‌దీప్‌
  • ట్విట్ట‌ర్‌లో త‌న బాధ‌ను చెప్పుకున్న న‌టుడు
  • ఇవాంక ట్రంప్ వ‌ల్ల ట్రాఫిక్ జామ్‌
  • ప‌వ‌న్ కొత్త సినిమా పాట‌ను ఉప‌యోగిస్తూ పేర‌డి
సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'అజ్ఞాత‌వాసి' సినిమాలోని 'బ‌య‌టికొచ్చి చూస్తే' పాట‌ను న‌టుడు న‌వ‌దీప్ త‌న బాధ‌ను చెప్పుకోవ‌డానికి ఉప‌యోగించుకున్నాడు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న జీఈఎస్‌కు ఇవాంక ట్రంప్ హాజ‌రైన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఈ రోజు ఉద‌యం 10 గంటలకు భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న న‌వ్‌దీప్‌కి కోపం వ‌చ్చేసింది. ట్విట్ట‌ర్‌లో త‌న బాధనంతా పాట రూపంలో చెప్పుకున్నాడు. ‘బయటికెళ్లి చూస్తే టైం 10ఓ క్లాక్.. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్‌’ అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. 
navdeep
twitter
traffic

More Telugu News