పేరు అందరూ అనుకున్నదే... 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ ఇది!

  • ఈ ఉదయం 10 గంటలకు రివీల్ కావాల్సిన కొత్త సినిమా టైటిల్
  • టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో కాస్త ఆలస్యం
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 25వ చిత్రం
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే సినిమాకు 'అజ్ఞాతవాసి' అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ వాస్తవానికి ఈ ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సి వుండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ ఆలస్యంగా విడుదలైంది. ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ ఇదే.
Go Back to Shorts
Pawan Kalyan
trivikram srinivas
agnatavasi

More Telugu News