'ఏందివయ్యా...?' అని రెచ్చిపోయి.. ఆపై క్షమాపణలు కోరిన యాంకర్ అనసూయ!
- ఫన్, క్రియేటివిటీ అంటుంటే, అర్జున్ రెడ్డి పేరెత్తుతారేంటి?
- దిమాక్ లో అటుది ఇటు, ఇటుది అటూ అయ్యిందా?
- నెటిజన్ వ్యాఖ్యలపై అనసూయ ఆగ్రహం
- ఆపై క్షమాపణలు చెప్పిన వైనం
తన ఫేస్ బుక్ లైవ్ చాట్ లో భాగంగా, జబర్దస్త్ పై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ క్రియేటివిటీని చంపవద్దని అనసూయ కోరగా, అర్జున్ రెడ్డి సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు ప్రస్తావించారు. ఆ సినిమాలో క్రియేటివిటీని ఎందుకు మెచ్చుకోలేదని నిలదీసిన వేళ, అనసూయకు కోపం వచ్చి ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆపై సర్దుకొని "సారీ... ఏమనుకోద్దు. వితండవాదాలు చేసేవాళ్లని, ఊరికే గెలుకుదాం అనుకునేవాళ్లని, బేసిక్ గా నెగటివిటీతో అప్రోచ్ అయ్యే వాళ్లను బ్లాక్ చేద్దామని డిసైడ్ అయ్యా. నా హ్యాపీనెస్ నా హ్యాండ్స్ లో అన్నట్టు... మీరు కూడా ఏది నచ్చితే అది చెయ్యండి. ఐ వాంటే జెన్యూన్, ఆనెస్ట్ హ్యాపీ పీపుల్ అరౌండ్" అని ట్వీట్ పెట్టింది.