హీరోగా మహేశ్ మేనల్లుడు .. నిర్మాతగా దిల్ రాజు!
- మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్
- తెలుగు తెరపైకి హీరోగా
- మొదలైన సన్నాహాలు
- త్వరలో అధికారిక ప్రకటన
ఈ నేపథ్యంలో మహేశ్ బాబు మేనల్లుడు కూడా హీరో అనిపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. మహేశ్ బాబు సోదరి పద్మావతి - బావ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్, హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టనున్నట్టుగా కొంత కాలం క్రితమే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కుర్రాడు నటనలో .. డాన్స్ .. ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడట. గల్లా అశోక్ ను హీరోగా దిల్ రాజు పరిచయం చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ద్వారా ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందట.