కేటీఆర్‌ బావమరిదిపై ఆరోప‌ణ‌లు చేసినందుకు.. రేవంత్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో డ్రగ్స్ విక్ర‌యాల వ్యవ‌హారాల్లో కేటీఆర్ బావ‌మ‌రిదికి పాత్ర ఉంద‌ని, తాను ఆధారాల‌తో పాటు నిరూపిస్తాన‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవ‌లే వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్‌ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ విషయంలో ఈ రోజు రేవంత్ రెడ్డికి పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశార‌ని అందులో ఆయన పేర్కొన్నారు. నిన్న రాత్రి హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన సన్‌బర్న్‌ పార్టీ స‌హా న‌గ‌రంలో జ‌రుగుతోన్న‌ ఇతర ఈవెంట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. న‌గ‌రంలో అస‌లు తనకు పబ్‌లు లేవని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి త‌న‌కు సారీ చెప్పాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.   
Go Back to Shorts
Revanth Reddy
KTR
drugs

More Telugu News