నాగ్ .. వర్మ సినిమాలో హీరోయిన్ గా అనుష్క!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్ .. వర్మ సినిమాలో హీరోయిన్ గా అనుష్క!

  • అన్నపూర్ణ స్టూడియోలో వర్మ సినిమా షూటింగ్  
  • యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో నాగ్  
  • కథానాయికగా అనుష్క చేసే ఛాన్స్  
నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా టైటిల్ ఎలా వుండనుందనే విషయంలోను .. కథానాయిక విషయంలోను అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా 'టబు'ను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని వర్మ స్పష్టం చేశాడు. తాజాగా అనుష్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అనుష్కను తెలుగు తెరకి పరిచయం చేసింది నాగార్జునే. 'బాహుబలి' సమయంలో ఒప్పుకున్న 'భాగమతి' సినిమాను అనుష్క ఇటీవలే పూర్తి చేసింది. కొత్తగా ఆమె అంగీకరించిన ప్రాజెక్టులు ఏమీ లేవు. దాంతో నాగ్ అడగడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.     
nagarjuna
anushka

More Telugu News